CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

న్యూడెమోక్రసీ నాయకులు తుపాకుల నాగేశ్వరావు అక్రమ అరెస్టును ఖండించండి.

Share it:

 


మన్యం మనుగడ,బూర్గంపాడు:


సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావును మంగళవారం ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి , టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు డివిజన్ కార్యదర్శి మోరా రవి , ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు లు తీవ్రంగా ఖండించారు. మంగళవారం బూర్గంపాడు మండలం, టేకుల చెరువు గ్రామం లో తుపాకుల నాగేశ్వరరావు అరెస్టును ఖండిస్తూ అత్యవసర కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నాయకులను, సంబంధంలేని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం, అప్రజాస్వామికం అన్నారు.కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరావుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యూడెమోక్రసీ క్రియాశీల పాత్ర పోషించిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజా నాయకులను అరెస్టులు చేయడం , కేసులు పెట్టడం వంటి అప్రజాస్వామిక, అణచివేత పద్ధతులు కొనసాగుతున్నాయని అన్నారు. చారిత్రాత్మక ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ప్రజలు ఇలాంటి చర్యలను ఆమోదించరనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: