CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం జిల్లా కలెక్టర్ : అనుదీప్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా


క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ మీద కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.ఈ మేరకు కలెక్టరేట్ సమావేశపు హాలులో వ్యవసాయ,ఉద్యాన,డిఆర్దిఓ, ఇరిగేషన్,ఎస్సీ కార్పోరేషన్, మున్సిపల్ కమిషనర్లతో వర్షాకాల పంటలు ప్రణాళిక, దళితబంధు,మన పూరు, మనబస్తీ - మనబడి, హరితహారం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 2వ తేదీన మద్యాహ్నం 3.30 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు రైతువేదికలో వ్యవసాయ, ఉద్యాన అధికారులతో అయా రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అధికారులు సమగ్ర కార్యచరణ ప్రణాళికలతో హాజరు కావాలని స్పష్టం చేశారు.వ్యవసాయ విస్తరణ అధికారులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలుకు ప్రతిపాదనలు

పంపాలని వ్యవసాయ అధికారులని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పంట సలహాలు సూచనలు అందించేందుకు రైతువేదికల్లో అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగును చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు.


నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు విత్తన దుకాణాలను టాస్క్ ఫోర్సు సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.


 విత్తన దుకాణాలను అధికారులు నిర్వహించిన తనిఖీలు, గుర్తించిన అంశాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. 


దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులకు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనిముట్లుకు అధిక ప్రాధాన్యత నివ్వాలని చెప్పారు.


మన జిల్లాలో వ్యవసాయం పెద్ద ఎత్తున సాగువుతున్నందున వ్యవసాయ పనిముట్లకు ఎల్లప్పుడూ మంచి గిరాకీ ఉంటుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దళితబంధులో ఇద్దరు, ముగ్గురు లబ్దిదారులు సంయుక్తంగా యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఉన్నందున నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సంయుక్త యూనిట్లు ఏర్పాటుపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మన వూరు, మనబస్తీ - మనబడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల మరమ్మత్తు పనులు చేపట్టాలని చెప్పారు.


 మొక్కలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. మేజర్ రహదారుల్లో మొక్కలు నాటాలని చెప్పారు. రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు అహ్లాదం కలగాని ఆయన స్పష్టంచేశారు. నర్సరీల్లో మొక్కల పెంపకం చర్యలను నోట్ క్యామ్ యాప్ లో మూడు ఫోటోలను సేకరించాలని డిఆర్డిఓకు సూచించారు.రివర్ బ్యాంక్ ఏరియాల్లో ఎంత వరకు మొక్కలు నాటగలమో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.


 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు,ఉద్యాన అధికారి మరియన్న, ఇరిగేషన్ అధికారి అర్జున్, ఈఈ భీంమ్లా డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిఈఓ సోమశేఖరశర్మ, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: