CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖమ్మం లో చేపట్టిన భారీ రైతు నిరసన దీక్షా కార్యక్రమం విజయవంతం.

Share it:

 


మన్యం మనుగడ, ఖమ్మం:

కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్టీఅధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖమ్మం నడిబొడ్డున కదంతొక్కిన జిల్లా రైతాంగం . ఈ రోజు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద చేపట్టిన రైతు నిరసన దీక్ష కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జిల్లా నలుమూలల నుండి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. పార్టీ పిలుపు అందుకున్న పార్టీ శ్రేణులు, నాయకులు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేంతవరకు పోరాటంలో మేము సైతం భాగస్వాములు అవుతామని మండుటెండలో ఎండను సైతం లెక్కచేయకుండా నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు


🟥 పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ తాత మధుసూదన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా జిల్లా మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు, జిల్లా పరిషత్, డీసీసీబీ , డీసీఎంస్, మున్సిపల్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు , జడ్పీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ బయకులు మహా దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు . 


🟥 వేదికపై ఉన్న అందరు ప్రజాప్రతినిధులు వరికంకులను మెడ లపై వేసుకొని నిరసనగా నల్ల కండువాలు ధరించారు


🟥 సాంస్కృతిక విభాగం కళాకారులు మధ్య మధ్యలో పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి . వారు పాడే పాటలకు వేదిక పైన ఉన్న నాయకులు హాజరైన రైతు సోదరులు సైతం పదం పాడుతూ కదంతొక్కారు.


🟥 పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సూచనమేరకు వేదిక ఫై LED SCREEN 

ఏర్పాటు చేసి తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పైబండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు ప్రదర్శించటం అది విని హాజరైన రైతులు వారి వైఖరికి నిరసనగా ఎద్దేవా చేశారు.


🟥 అన్నిటికంటే ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గుజరాత్ లోపవర్ హాలిడే మరియు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అమలవుతున్న తీరుపై విశ్లేషణ ఆకట్టుకుంది.


🟥 మహిళా రైతులు, మహిళా ప్రజాప్రతినిధులు వృద్ధులు సైతం ఎండను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: