CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు..!- బెల్లంపానకం స్వాధీనం చేసుకున్న అబ్కారి సిబ్బంది..

Share it:


  • - గిరిజన మహిళపై చేయి చేసుకున్న ఎక్సైజ్ ఎస్ఐ సాయి కుమార్..
  • - ఎక్సైజ్ అధికారుల వాహనాన్ని అడ్డగించిన తండా వాసులు..


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ పంచాయతీ శివారు దుబ్బతండాలో కొంతమంది గుడుంబా తయారీ చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ఐ సాయికుమార్ తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ అధికారుల రాకను గమనించిన సారా తయారీదారులు కొంతమంది పారిపోగా, సారా తయారు చేస్తూ, మంగమ్మ అనే మహిళ, అతని కుమారుడు శోభన్ లు ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద వున్న

5 లీటర్ల నాటుసారా, 20 లీటర్లు పానకం స్వాధీనపరుచుకొని, కేసు నమోదు చేయుటకు, మంగమ్మ ఆమె. కుమారుడు శోభన్ ను అధికారులు వాహనంలోకి ఎక్కించే సమయంలో, ఎక్సైజ్ ఎస్ఐ సాయికుమార్, ప్రవర్తన బాగోలేదని, చీర మార్చుకొని వస్తాను అన్నా వినకుండా మంగమ్మ అనే మహిళను విచక్షణారహితంగా కొట్టాడని, అడ్డుకున్న ఆమె కొడుకును సైతం కొట్టిండం టూ, మంగమ్మ గాయాలు చూపిస్తూ గ్రామస్థులకు తెలపగా. ఆగ్రహించిన దుబ్బతండా వాసులంతా ఏకమై ఎక్సైజ్ అధికారుల వాహనాన్ని అడ్డగించారు. మహిళా అధికారులు లేకుండా మహిళలలను ఎలా అదుపులోకి తీసుకుంటారని. ఎక్సైజ్ అధికారులతో వాగ్విదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకొని, గ్రామస్తులతో మాట్లాడి ఆందోళన విరమింప జేశారు.

- ఎక్సైజ్ ఎస్ఐ వివరణ..

జూలూరుపాడు మండల పరిధిలోని దుబ్బతండా గ్రామంలో కొంతమంది గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు. ఉన్నతధికారుల ఆదేశాలమేరకే సిబ్బందితో దాడులు నిర్వహించామని, మా రాకను గమనించిన కొంతమంది గ్రామస్తులు పారిపోగా, మంగమ్మ, ఆమె కుమారుడు శోభన్ లు సారా తయారు చేస్తూ పట్టుపడగా వారిని అదుపులోకి తీసుకోబోతున్న సమయంలో సహకరించకుండా ఆరోపణలు చేస్తున్నారని, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, సారా తయారు చేసిన ఆధారాలు ఉన్నాయని, మా విధులకు ఆటంకం కలిగించినవారిపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసినట్టు తెలిపారు.

Share it:

TS

Post A Comment: