CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యల పై కేంద్ర రైల్వే మంత్రితో టిఆర్ఎస్_పార్టీ_జిల్లా_అధ్యక్షురాలు..

Share it:


  • మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యురాలు
  • మాలోత్_కవితమ్మ ప్రత్యేక భేటి.


న్యూఢిల్లీమన్యం మనుగడ వెబ్ డెస్క్:

★ పాండురంగాపురం-భద్రాచలం రైల్వేమార్గం ఏర్పాటు చేయాలి..


★ మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్ లలో మరికొన్ని రైల్వేహాల్టులు మంజూరు చేయాలి.

 

★ మణుగూరు-రామగుండం రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి.


★ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అనేక రైల్వే పరమైన అంశాలపై, సమస్యలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రత్యేకంగా బేటీ అయ్యారు.


★ దక్షిణాది అయోద్యగా కీర్తిగడించిన భద్రాచలం శ్రీరామచంద్రస్వామివారి పవిత్ర దివ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారని.. వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం పాండురంగాపురం నుండి భద్రాచలం కు 12కిమీ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు.


★ గత అనేక సంవత్సరాలుగా ఈ..అంశంపై వినతులు సమర్పిస్తున్నామని గుర్తుచేసారు. శ్రీరామచంద్రుని దివ్యక్షేత్రం అభివృద్ధికి సహకరించాలని కోరారు. 


★ మణుగూరు నుండి రామగుండం వయా భూపాలపల్లి నూతన రైల్వేట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. 


★ మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని ప్రయాణీకుల రాకపోకలు విపరీతంగా పెరిగాయని.. మరిన్ని రైల్వేహాల్టులు కల్పిచాలని యంపి కవిత కోరారు. మహబూబాబాద్ లో రప్తిసాగర్, జిటిఎక్స్ ప్రెస్, విశాఖపట్నం సూపర్ పాస్ట్, నరసాపూర్ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ లు కల్పించాలని కోరారు*.


★ డోర్నకల్ రైల్వేస్టేషన్ లో మణుగూరు ఎక్స్ ప్రేస్, పద్మావతి, చార్మినార్, గౌతమి, లింక్ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ కల్పించాలని యంపి కవిత కోరారు.


 ★ యంపి కవిత వినతులను సానుకూలంగా విన్న రైల్వేమంత్రి అశ్విన్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: