CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్ధిక సైబర్ నేరాలపై జాగ్రత్త వహించండి -కో ఆర్డినేటర్ వి అంజి బాబు.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో గల వికేడివిఎస్ కళాశాల యందు ప్రిన్సిపాల్ శేషు బాబు సమక్షంలో పేస్ ఎన్జీవో సభ్యులు విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎస్బిఐ స్టాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత కోఆర్డినేటర్ వి అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని, లావాదేవీలు సురక్షితంగా ఉండాలంటే లావాదేవీలు బ్యాంకు ద్వారా జరుపుకోవాలని, ముందు ముందు అంతా డిజిటల్ మారబోతున్నదని తెలియజేశారు. డిజిటల్ పేమెంట్ వచ్చిన దగ్గరనుండి ఆర్దిక సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని అలాంటి వాటికి గురి కాకుండా అప్పుడప్పుడు పిన్ నెంబర్లు మారుస్తూ ఉండాలని, బ్యాంకు కు సంబంధించి ఏదైనా సేవలకోసం బ్యాంకు మాత్రమే వెళ్లి సరి చేసుకోవాలని, ఎటువంటి మోసపూరిత కాల్స్ కి సమాధానం ఇవ్వకూడదని, ఆన్లైన్లో తెలియని లింక్ ఓపెన్ చేయకూడదని సూచన ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినా ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్లను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన, రూపే కార్డుల ఉపయోగాలు మొదలైన బ్యాంక్ పథకాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్బిఐ ఉద్యోగి రాజ్యలక్ష్మి, ఆర్థిక అక్షరాస్యత ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి, కళాశాల విద్యార్థులు మరియు కళాశాల స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: