మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పేద ప్రజల కోసమే ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ ప్రవేశ పెట్టడం జరిగిందని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం నుండి వచ్చిన కానుకలను ముస్లింలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడన్నారు. విద్యార్థుల కోసం సన్నబియ్యంతో అన్నం పథకం,రైతుల కోసం రుణమాఫీ,ఉచిత కరెంటు 24 గంటలతో పాటు, రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు. అనంతరం సిపిఎం నాయకుల ప్రజా సమస్యలపై వినతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, మల్లిపెద్ది లక్ష్మీ భవాని, భానోత్ కుమారి, పూసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భూక్య రాజి, టిఆర్ఎస్ నాయకులు భూపతి రమేష్,సత్తి నాగేశ్వరరావు, జడ వెంకయ్య, భూపతి శ్రీనివాసరావు,వంకాయలపాటి బాబురావు, తాహసిల్దార్ వర్స రవికుమార్, ఎంపీడీవోఅన్నపూర్ణ, మండల వ్యవసాయశాఖధికారి నవీన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: