CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులపై కక్ష్య సాధింపు చర్యలు కేంద్రం ప్రభుత్వం వీడాలి.తెలంగాణలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలి.

Share it:

 




  • అన్నదాతలను ఆదుకోవాల్సినది కేంద్ర ప్రభుత్వమే.
  • తెలంగాణలో ప్రతి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల
  •  నిరసన జ్వాలలు

మన్యం మనుగడ/వాజేడు: యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ.. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో నిరసన దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నూగూరు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొదెబోయన బుచ్చయ్య,నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెనుమళ్లు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి విమర్శించారు.ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని అంబెడ్కర్ రాజ్యాంగములో రాసారని, ఎక్కడ ఏ పంటలు పండించాలో కేంద్రం చెప్పాలన్నారు.మనం జై కిసాన్ అంటుంటే వాళ్ళు నై కిసాన్ అంటున్నారని, బండి సంజయ్ కు ఒక్కటే సవాల్ కేంద్రం వరి పంట కొంటదా లేదా చెప్పాలన్నారు. శివాజీ బొమ్మలు హిందూ ముస్లిం అంటూ గోల తప్ప ఏముందని, నాలుగు చిల్లర ఓట్లకోసం బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలోజెడ్పిటిసి సభ్యురాలు తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, ఎంపీటీసీ సభ్యులు గొంది రమణారావు, మండల కో ఆప్షన్ సభ్యులు సేక్ నిజాముద్దీన్, మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య, మండల ప్రచార కార్యదర్శి రాణి మేకల రాంబాబు, వాజేడు టౌన్ ప్రెసిడెంట్ మోడీ గా తిరుపతి, జిల్లా రైతు సమన్వయ సమితి కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు, నాగారం ఉపసర్పంచ్ కల్లూరు సతీష్, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి రామకృష్ణ, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విశ్వనాధ ప్రసాదరాజు, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు దంతులూరు సూర్యనారాయణ, వర్మ, ఆత్మ డైరెక్టర్ గార నాగార్జున రావు, వార్డు మెంబర్ పెను మల్లు వెంకట రెడ్డి, తల్లడి వెంకటేశ్వర్లు, వాసం కృష్ణయ్య, సారయ్య, అశోక్ రెడ్డి, మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: