CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల సమస్యను పరిష్కరించి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి!.ఏప్రిల్ 9న పాల్వంచలో ప్రదర్శన, సదస్సును విజయవంతం చేయాలి!.ములకలపల్లిలో న్యూడెమోక్రసీ ప్రచారం

Share it:


        


మన్యం మనుగడ,ములకలపల్లి:

పొడు భూముల సమస్యను పరిష్కరించి, ప్రభుత్వ పథకాలు అందరికీ అమలు చేయాలని కోరుతూ.. ములకలపల్లి మండలం లో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం డివిజన్ నాయకులు కామ్రేడ్ మోరా రవి పిలుపునిచ్చారు. మండలంలోని చాపరాలపల్లి , గుట్టగూడెం, పూసుగూడెం , సీతారాంపురం, చింతలపాడు, అన్నారం, గుర్రాలకుంట, ధర్మన్న నగర్, అన్నారం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ములకలపల్లి మండల నాయకులు తిరుపతన్న అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో కామ్రేడ్ మోరా రవి ప్రసంగిస్తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెట్రోల్ , డీజిల్ రేట్లు , నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంభవించిన కష్ట కాలంలో, ప్రజలపై బస్ చార్జీలు,, రైల్వే ఛార్జీలు పెంచి భారం మోపారని ఆయన అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అడవి గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఆదివాసుల వరకు చేరడం లేదని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు బలవంతంగా గుంజుకున్నా ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళని బయటి వారిగా చూస్తున్నారని ఆయన అన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు సమాన హక్కులు వర్తిస్తాయని తెలిపారు. ప్రభుత్వ పన్నులు వసూలు చేస్తున్న వారి నుండి కనీసం వారి గ్రామాలలో సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు. అడవిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల పోడు భూములను గుంజుకుని గెంటి వేయాలని చూస్తున్నారని ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్టవ్యతిరేకం అన్నారు. చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదివాసులకు రక్షణ కల్పించాలని సమస్యలు పరిష్కరించాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల తొమ్మిదో తారీఖున పాల్వంచలో భారీ ప్రదర్శన , సదస్సు నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐయప్టియు జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరావు, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, ముక్తి జోగయ్య , మడకం దేవయ్య , బాడిస సురేష్ , మడకం బండి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: