CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మెగా రికార్డ్స్ క్రియేషన్స్ ఉగాది పురస్కారాలు 2022 అవార్డ్స్.

Share it:

 



ఖమ్మం : రామగిరి ఫంక్షన్ హాల్లో ఉగాది పురస్కారాలు 2022 అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆదివారం నాడు మెగా రికార్డ్స్ క్రియేషన్స్ సంస్థ హైదరాబాదు వారిచే నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి మెగా రికార్డ్స్ క్రియేషన్స్ సంస్థ ఫౌండర్ పి. శ్రీనివాసరావు , ప్రత్యేక అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య , సభాధ్యక్షులు డా"చిల్లా రాజశేఖర్ రెడ్డి , ఆత్మీయ అతిథి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తాతాజీ , ఆర్యవైశ్య సంఘ మహిళా అధ్యక్షురాలు ఆర్ . ఈశ్వరి , గౌరవ అతిథులు ఫిలిం రైటర్ & డైరెక్టర్ నాగరాజు , జబర్దస్త్ ఫేమ్ జిగేల్ జీవన్ లు పాల్గొన్నారు . అనంతరం సభ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి అవార్డు అందిస్తూ ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం అని , రైతులను , దేశ సేవకులను , సంఘ సేవకులను , కళా ప్రతిభ వంతులను గుర్తించి అవార్డు అందజేయడం చాలా ఆనందకరంగా ఉందన్నారు . ఈ ఉగాది పురస్కారాలకు దేశానికి సేవలు అందించి రిటైర్డ్ అయిన జవాన్ బీ వీరబాబు తోపాటు జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ జిగేల్ జీవన్ రావడం విశేషం అని కొనియాడారు . జవాన్ భావోద్వేగమైన ప్రశంగం , జీవన్ జానపద పాటల సందడి , నాగ సాయి & నవీన్ బృందం ఆర్కెస్ట్రా పాటల సింగింగ్ , ఖమ్మం కోలాట ప్రదర్శన & వేదాద్రి చిన్నారుల నృత్య ప్రదర్శనలు , జానపద పాటల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అన్నారు . అవార్డు అందుకున్న కళాకారులు ప్రతిభావంతులు అందరూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు . ఈ ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారిలో డి.వి.ఎస్.ఎం శర్మ , సీ.హెచ్ .వీ. ప్రసాద్ రాజ్ , జీ. సత్యనారాయణ , కె. శ్రీనివాస రావు , జీ. రామకృష్ణ , టి. నాగ బ్రహ్మచారి , బీ.వీరబాబు , జె. ప్రసన్న , డి. నరసింహారావు , యన్. వీరభద్రం , కె. రమేష్ , పి.విజయ్ తదితరులు ఉన్నారు . తెలుగు రెండు రాష్ట్రాలు నుండి సుమారుగా 30 మందికి అవార్డ్స్ ప్రదానం చేశారు .

Share it:

TS

Post A Comment: