CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంట్రాక్ట్ కార్మికులకు 11వ వేజ్ బోర్డు వర్తింపజేయాలి, ఒకటో కేటగిరి వేతనం చెల్లించాలి. --:ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:

 ఈ నెల 22 వ తారీఖున కలకత్తా లో జరిగే పదకొండవ వేజ్ బోర్డు సమావేశంలో బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేజ్ బోర్డు వర్తింపజేయాలని, ఒకటో కేటగిరి వేతనం చెల్లించాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి కోల్ ఇండియా యాజమాన్యాన్ని, సింగరేణి యాజమాన్యం ని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక సింగరేణి ఎస్ఓ టు జిఎం కు వినతి పత్రం అందజేశారు.

            ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బొగ్గు పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉందని, వీరు పర్మినెంట్ కార్మికుల తో సమానంగా పని చేస్తున్నప్పటికీ, ఏ విధమైన హక్కులు గాని, సౌకర్యాలు గాని లేవన్నారు. వీరు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. పర్మినెంట్ కార్మికులకు నిర్ణ ఇస్తున్నట్లుగా కాంట్రాక్టు కార్మికుల వేతనాలు కూడా వెజ్ బోర్డు లోనే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తారీఖున కలకత్తా లో జరిగే 11వ వేజ్ బోర్డు సమావేశాలలో కాంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం చెల్లించే విధంగా, వెజ్ బోర్డును వర్తింప చేసే విధంగా జె బిసిసిఐ సంఘాలు కృషి చేయాలని కోరారు. 11వ వేజ్ బోర్డు సమావేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని కోల్ ఇండియా యాజమాన్యాన్ని ,సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

           ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి. గౌస్, కోశాధికారి వి. జానయ్య, బ్రాంచ్ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: