CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నేడు బాబు జగ్జీవన్ రామ్115వ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:


1.1908 వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన బీహార్ రాష్ట్రంలో ఛాంద్వా అను గ్రామమున చమార్(మాదిగ) కులము లో జన్మించెను.ఆనాడు బీహార్ లో చమార్లు కూడా అంటారాణితనం కఠినముగా అనుభవిస్తున్న రోజుల్లో,పురవీధుల్లో కూడా నడవనివ్వకుండా దేవాలయ ప్రవేశాలు కూడా నిషేదించబడ్డ పరిస్థితులు గల ప్రాంతం నుండి వచ్చిన అతిసామాన్య స్థాయి నుండి దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారు.


2.జగ్జీవన్ రామ్ గారు కేంద్రంమంత్రి వర్గములో 25సంవత్సరాలు పైగా క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక రంగాల వైపు అడుగులు వేస్తున్న దళితులను అణిచివేయబడుతున్న రోజుల్లో ఎందరో దళిత పారిశ్రామికులకు,చిన్న తరహా వ్యాపార వాణిజ్య సంస్థలకు పర్మిషన్లు లైసెన్స్ లు ప్రధాన పాత్రపోషించారు.ముక్యంగా నిస్సహాయ పరిస్థితులలో ఉన్న దళితుల అభివృద్ధి కోసం కృషిచేశాడు.


3.కాశీ విద్యాలయములో విధ్యను అభ్యసిస్తున్న రోజుల్లో మంగళ(Barbar) షాపుల్లో క్షవరం చేయుటకు నిరాకరించెను.వెంటనే జగ్జీవనుడు చిన్నపాటి ఉద్యమం లేవనెత్తి మంగళ షాపులముందు ధర్నాలు ఉదృతం చేసెను.చివరికి మంగళ షాపుల వారు దళితులకు క్షుర కర్మ చేయుటకు అంగీకరించారు.


4.1927 కలకత్తా లోని విద్యాసాగర్ కాలేజీలో చేరిన క్రొత్తలో కాన్పూర్ లో స్వామి అచ్యుతానంద సాగిస్తున్న హరిజన ఉద్యమ స్పూర్తితో భక్తరవిదాస్ మహాసభను స్థాపించారు.ఈ భక్త రవిదాస్ సమాజం దళితులను సమాజంలో అణిచివేస్తున్న సాంఘిక మత ఆచారాల నిర్మూలన కోసం కృషి చేసెను.1930 లో ఉప్పు సత్యాగ్రహ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న జగ్జీవన్ రామ్ లాఠీల దెబ్బలు కూడా తిన్నారు.ఒకవైపు స్వతంత్ర ఉద్యమం లో పాల్గొంటూనే B.SC పూర్తి చేశారు.


5.ఈ రోజు నాకు అన్న పానీయాలు ఎంత ముఖ్యమో హరిజన అభ్యుదయం కూడా నా ప్రాణముతో సమానం అంటూ హరిజన పత్రిక ద్వారా అస్పృశ్యత కృషి చేస్తూ బీహార్ కలకత్తాలలో హరిజన ఉద్యమాన్ని ఉదృతం చేస్తూయాత్రలు సాగించెను.అంతేకాకుండా హరిజనులు రాజకీయంగా బలపడడం కోసం Depressed Classes League ను ఏర్పాటు చేశారు.


6.నాడు గాంధీజీ హరిజనులను గోవులతో సమానం అని ఉచ్చారణ చేసినప్పుడు గాంధీకి శిష్యుడు అయిన జగ్జీవన్ రాం కోపోద్రిక్తుడై వెంటనే బాపూజీ! మేము చేతకానివారమా పశువులతో సమానమా అని ఎదురించెను. అదే సమయంలో అఖిల భారత దళిత వర్గీయ సంఘానికి బీహార్ ప్రాంత అధ్యక్షుడు గా ఎన్నిక అయ్యాడు.


7.1935 లో స్వతంత్ర ఉద్యమం లో పాల్గొంటూ గుజరాత్ బీహార్ లలో వ్యవసాయ కూలీల అభ్యుదయానికి కృషి చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడుగా జైలు జీవితం కూడా హజారీభారగలో అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉధ్యమములో పాల్గొని మరలా జైలు జీవితం గడిపాడు. స్వాతంత్ర్య ఉద్యమం లో బ్రిటీష్ వారి అల్లర్లను ఉక్కుముక్కలా ఎదురించిపోరాడినందుకు 1946 లో మొట్ట మొదటి తాత్కాలిక ప్రభుత్వం లో కార్మిక శాఖ మంత్రిగా నెహ్రూ చేసెను."My heart goes our in respect ful admiration to jagajevan ram for his having emerged the purest gold out of fire" అని మహాత్మా గాంధీ జగ్జీవన్ రామ్ ని ప్రశంసించారు.


8.ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత Buffer Stocks ని పెంచి ఏ కరువు వస్తుందో రానివ్వండి చూద్దాం ఈ దేశ ప్రజలు తిండికి అలమటించరు అని చెప్పేవాడు.రక్షణ మంత్రి గా పాకిస్తాన్ పై భారత సైన్యాన్ని నడిపి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్య సిద్ధిలో బంగ్లాబంధు మ్యూజిబూర్ రెహమాన్, ఇందిరా గాంధీ లతో కలిసి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పరిచి చరిత్రలో నిలిచిపోయాడు.


9.జగ్జీవన్ రాం ఏ శాఖలో మంత్రిగా ఉన్నాను ఆ శాఖలో ఉన్న ఉద్యోగాలలో దళితుల కోటాను తప్పనిసరిగా నింపేవాడని Dr.C.Subramaniam ఎద్దేవా చేస్తూ చమత్కరిస్తూ ఉండేవారు.సీనియర్ జాతీయ నేత అయిన తనకు కేవలం దళితుడు అన్న కారణంగా ప్రధాన మంత్రి పదవిని నిరాకరించిన ఈ దేశ నాయకులను బుద్ది చెప్పడం కోసం రాష్ట్రపతి పదవిని నిరాకరించి స్వయంగా తానే ఎన్నికల్లో బలపర్చిన 15 మందిలో 14మంది గెలుపొందించి సత్తా చాటారు.


10.25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎలాంటి స్కాములకు కానీ అవినీతికి కార్యకలాపాలు చేసినట్లు కానీ ఎక్కడ రెమర్క్ లేదు. ఆయాన స్పూర్తితో పంజాబ్ నుండి కాన్సిరాం, ఉత్తరప్రదేశ్ నుండి మాయావతి,బి.పి.మౌర్య, ఆంధ్రానుండి బంగారు లక్ష్మణ్ మరియు సుశీల్ కుమార్ షిండే మొదలగు వారు జాతీయస్థాయిలో నాయకులుగా చమార్లు ఎదిగారు.


11.దళితుల కోసం,దేశం కోసం ఇంతగా తనవంతు కృషిచేసిన నాయకుడిని గౌరవప్రదమైన స్థాయిలో ఆరాధించడం మానవతా దృక్పథం నీతివిలువలతో కూడిన ధర్మం గా 25 కోట్ల జనాభాను కలిగిన చమార్లు యొక్క బాధ్యత.నేటికి కూడా విశేష ఆదరణ కలిగిన నాయకుడిగా పొందుతున్నారు.

Share it:

TS

Post A Comment: