CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసరించుకోవాలి.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీ ఎంపీ మిడియం బాబురావు.

Share it:


ములకలపల్లి:న్యూస్:మార్చి24:(మన్యం మనుగడ)ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ విద్యుత్ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు పెంచడం ద్వారా రూ1.45 నుండి రూ1.95 పెరిగిందని,పరిశ్రమలకు యూనిట్ కు ఒక్క రూపాయి చొప్పున గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచి ప్రజల పై విపరీతమైన భారాన్ని వేస్తున్నారని అన్నారు.విద్యుత్ పంపిణీ సంస్థలు టారీప్ రేట్లును బహిరంగ విచారణలో పాల్గొన్న అనేకమంది చార్జీలు పెంచొద్దని,ప్రభుత్వమే సబ్సిడీ గా బరించాలని శాస్ర్తియంగా వివరించారని,అతితక్కువ దరకు లభ్యమయ్యే విద్యుత్ ను కొనుగోలు చేయకుండా ఎక్కువ రేటు కు వేలంలో పాడిన వారినుండి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారని ఆర్డర్ ఆప్ మెరిట్ డిస్పాచ్ ప్రకారం విద్యుత్ వినియోగిస్తే నష్టాలు తగ్గుతాయని అన్నారు.విద్యుత్ చార్జీల ను పెంచడం ద్వారా ప్రజల పై 55495 కోట్ల అదనపు భారం పెరిగిందని అన్నారు ఇలానే గత ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు లాగా వ్యవహరిస్తే పతనం తప్పదని, హెచ్చరించారు.రష్యా,ఉక్రెయిన్ దేశాల యుద్దం వలన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలు పెరిగాయని చెప్పిన మాటలు వాస్తవం కాదని,పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, వూకంటి రవికుమార్, నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు, ఒగ్గెల భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: