- మద్దతు తెల్పిన టిఆర్ఎస్,సీపీఐ,
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ములకలపల్లి లో ప్రదర్శన.
ములకలపల్లిమార్చి28(మన్యం మనుగడ)ప్రతినిధి:
జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న 28.29 జాతీయ కార్మిక సమ్మె సందర్భంగా ములకలపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ,మిడ్డే మిల్ వర్కర్స్,ఆశా కార్యకర్తలు,గ్రామ పంచాయతీ వర్కర్స్,హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు,ఎస్ బి ఐ బ్యాంక్ నుంచి సాయి బాబా గుడి వరకు ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా sbiఎస్ బి ఐ,ఏపీజీవిబి, డీసీసీబీ,బ్యాంక్ లను మూసివేశారు. సమ్మె కు అధికార టి ఆర్ ఎస్, సీపీఐ శ్రేణులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ మోడీ దేశంలో గల ప్రభుత్వం రంగ సంస్థలు అన్నింటిని ప్రేవేట్ పరం చేసి బీజేపీ శ్రేణులు కు అంబానీ,ఆదాని గ్రూపు లకు ఇతర దేషా ల వారికి అమ్ముతున్నారని, ఇప్పటికే బ్యాంక్,ఇన్సూరెన్స్, విమానం,రైల్,చమురు,ఇస్రో,రక్షణ శాఖ,బొగ్గు క్షేత్రాలు,జాతీయ రహదారులు,విద్యుత్,ఇలా ఒక్కొక్కొటిగా అన్ని రంగాలను ప్రవేట్ పరం చేస్తు కార్మికుల ను,ఉద్యోగుల ను మోసం చేస్తున్నారని,ప్రజల సొత్తు ను లక్షల కోట్ల రూపాయల లూటీ చేస్తున్నారని అన్నారు.44 కార్మిక చట్టాలు మార్పు చేసి 4 కోడ్ లు గా మార్చి హక్కులు లేకుండా కార్మికుల ను అణిచివేత కోసం కుయుక్తులు చేస్తున్నారని అన్నారు.అంగన్వాడీ, ఆశా,మధ్యాహ్నం భోజన,గ్రామ పంచాయతీ,కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తింపు ఇవ్వాలని. 26వేయిల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని,హమాలి కార్మికుల కు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎండి యూసుఫ్,కో-ఆప్షన్ సభ్యులు ఎస్ కె జబ్బార్.పువ్వాల శ్రీ లత,కోసురి ఉపేంద్ర,బైట మాధవి,సున్నం మణి, నాగలక్ష్మి,దాసుల పుష్పవతి, నకిరికంటి పుల్లారావు,మిర్యాల వెంకన్న,అవులూరి రాంబాబు,గద్దల మహేష్,శంకర్,కొండ్రు బాబూరావు, చిట్టీబాబు,సున్నం నవీన్,అనిల్.
టిఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు పువ్వల మంగపతి, శనగపటి సీతారాములు, ఉప సర్పంచ్ టిఆర్ఎస్ మండల కార్యదర్శి ఆంజన్ రావు. పుష్పల చంద్రరావు, రవి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: