మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ యు ఐ కమిటీని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి హాజరై మాట్లాడుతూ. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని ప్రజా సమస్యలపై పోరాడాలని మంచి లీడర్లుగా ఎదగాలని అన్నారు.
ఎన్ ఎస్ యు ఐ కమిటీ అధ్యక్షులు గా కుమ్మరి శివ, ఉపాధ్యక్షులుగా గార మహేష్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఎస్కె ఖాజా పాషా,కన్వీనర్లుగా జనగాం రాజు కుమార్,జనగం లోకేష్,కమిటీ సభ్యులుగా వినీత్,రోహిత్,రేవంత్,కమల్ పవన్,అజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు ఎండి రియాజ్,వావిలాల ఎల్లయ్య,మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు, ముకెర లాలయ్య,జాడి రాంబాబు,వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,పిఎసిఎస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, మాజీ ఎంపీపీ కోనేరు నగేష్, కట్కూరి రాధిక సరికొప్పుల శ్రీనివాస్,తాళ్లపల్లి నరేందర్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్,పడి దల హనుమంతు,కిరణ్, సత్యం,వీరయ్య,మాధవ్, సాధన పల్లి లక్ష్మయ్య, నాగమణి,భాగ్య,మానస, రమేష్,రామయ్య, కుమారస్వామి,రాజబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: