![]() |
- కోడల్ని కాపాడబోయి అత్త కూడా అనంతలోకాలకు
గుండాల మార్చి 23 (మన్యం మనుగడ): వారికి తెలియదు పొద్దు పొద్దున్నే మృత్యువు తరుముక వస్తుందని. మల్లన్న వాగు తమ పాలిట మృతి పాశం అవుతుంది అనుకో లేదు. రోజువారి లానే బట్టలు ఉతకడానికి అత్తా కోడళ్ళు ఎంతో సరదాగా వాగు కు వెళ్లారు. కానీ అక్కడే వారి బతుకులు తెల్లారి పోతాది అనుకోలేదు. అత్త కు సాయం గా వెళ్లిన మేనకోడలు సైతం మృత్యు ఒడికి చేరింది. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు మృతి చెందారు. దురదృష్టవశాత్తు వాగులో పడి ఇరువురు మృతిచెందిన సంఘటన గుండాల మండలంలో చోటు చేసుకుంది. మండలం పరిధిలోని రోళ్ళ గడ్డ గ్రామానికి చెందిన దుగ్గి స్వరూప(45), ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోటి లింగాల గ్రామానికి చెందిన చాపల మౌనిక (20) రోళ్ల గడ్డ గ్రామ సమీపంలోని మల్లన్న వాగులో బట్టలు ఉతికే తరుణంలో మౌనిక దురదృష్టవశాత్తు జారీ నీళ్ళలోకి పడిపోయింది. ఆమెను కాపాడేందుకు తన మేనత్త స్వరూప నీళ్లలోకి దిగటంతో ఇరువురికి ఈత రాకపోవడం వలన మృతి చెందారు. అత్తా కోడలు మృతిచెందడంతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.
Post A Comment: