CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి.--:ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే.

Share it:


ములకలపల్లి:మార్చి28(మన్యం మనుగడ)ప్రతినిధి:

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తూదని,దీనివల్ల పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ, ప్రైవేట్ యూనివర్సిటీల రాకను వెంటనే ఆపాలని,కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు కీసరి బన్నీ,బోర్రా కృష్ణ,కీసరి సంతోష్,తాటి వినయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: