CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రగతితో అద్భుత బృహత్ ప్రగతి వనాలు.--:ఎంపీపీ బానోత్ పార్వతి....

Share it:

 



 చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం లో పల్లెల్లో అద్భుతమైన ప్రగతి సాధించాయని ఎంపీపీ భానోత్ పార్వతి అన్నారు. ఆదివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలొ ఆమె పాల్గొని ప్రసంగించారు. తొలుత అన్ని శాఖల ప్రగతినివేదికలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పోకలగూడెం పంచాయతీలో పల్లె దవాఖానా మంజూరైందన్నారు. మండలంలో ఉపాధి హామీ పథకంలో 6,700 మంది కూలీలు ఉపాధిని పొందుతున్నారని, 225 మంది కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఆర్ అండ్ బి ఏఈ లక్ష్మణ్ నాయక్ పై మండల ప్రజా ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. లంకలవాగు బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం, తిప్పనపల్లి- సుజాతనగర్ రోడ్డు నిర్మాణ విస్తరణ పనులు ప్రజాప్రతినిధులకు తెలియకుండా చేయడం, రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తాం అని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధులు శాంతించారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి వృద్ధునికి పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మండలంలో 276 మందికి కొత్త పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అన్నపూర్ణ, ఎం పీ ఓ తులసీరామ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు రసూల్, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపీటీసీలు బొర్ర లలిత, సంగోండి వెంకట కుమారి, వైస్ ఎంపీపీ నరకుళ్ల సత్యనారాయణ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఇమామ్, సర్పంచులు, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: