మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట పంచాయతీ లో నూతనంగా నిర్మిస్తున్న రెండు సీసీ రోడ్లను సర్పంచ్ సున్నం సరస్వతి మరియు ఎంపీటీసీ నారం నాగలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎన్ఆర్జిఎస్ నిధులతో తిరుమలకుంటలో రెండు సీసీ రోడ్లను నిర్మించనున్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్క పల్లెను కూడా అభివృద్ధిలో ముందు వుండేలా అభివృద్ధి ప్రగతి పథంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తూ వున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, మాజీ సర్పంచ్ సున్నం రామలక్ష్మయ్య, తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, వార్డ్ నెంబర్ చెన్నరావు, అరిగల శ్రీను, వార్డ్ మెంబర్ కుర్సం సుధా, మొడియం జగనాద్ధం, తలగాని సుజాత, కందుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: