CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 29 ) మంగళవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో

దేశవ్యాప్త సార్వత్రిఫక సమ్మెలో భాగంగా 28 29 దమ్మపేట లో ఏఐటీయూసీ సీఐటీయూ వివిధ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి దమ్మపేట డిప్యూటీ తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ సిఐటియు మండల కార్యదర్శి కొప్పుల శ్రీను ఏఐటీయూసీ మండల కార్యదర్శి పందేటి చెన్నారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని కనీస వేతన జీవోలను అమలు చేయాలని మిగిలిన జీవోలను సవరించాలని కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి జీవో నెంబర్ 48 సవరించాలని అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం వివో లను కనీస వేతనం సామాజిక భద్రత అమలు చేయాలి హమాలీ ఆటో రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ హెల్పర్స్ సంక్షేమ బోర్డు ను పటిష్ఠంగా అమలు పరచాలని ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 భృతి ఇవ్వాలని జాతీయ సంపదను అమ్మకాలు నిలిపివేయాలి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక డిప్యూటీ తాసిల్దారు గారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగనవాడి పంచాయితీ మధ్యాహ్న భోజనం వర్కర్స్ అమాలి ఆటో గ్రామ దీపికలు వివిధ ప్రజా సంఘాల కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: