CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆత్మహత్యకు పాల్పడిన ఆదివాసి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి.సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాలం పుల్లయ్య డిమాండ్ ..

Share it:


మన్యం టివి దుమ్ముగూడెం::

రామచంద్రుని పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే, అయితే దుమ్ముగూడెం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య ఈ రోజు వారి కుటుంబ సబ్యులను కలిసి పరామర్శించారు తన సానుభూతిని తెలియజేశారు విద్యార్థిని ఇర్మమ్మ ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కారం పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థి మృతికి పూర్తిగా ఆశ్రమ పాఠశాల యాజమాన్యం ఐటీడీఏ అధికారులదేనని ఆరోపించారు అనారోగ్యంగా ఉందని తెలిసి విద్యార్థినిని వైద్యం కోసం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవలసి ఉండగా ఇంటికి ఎందుకు పంపించారని ఆయన ప్రశ్నించారు విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా మూడు రోజులుగా భద్రాచలం ఏరియా ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఉండగా విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఆశ్రమ పాఠశాల యాజమాన్యం కానీ ఐటీడీఏ అధికారులు గాని కనీసం అటువైపుగా వెళ్లలేదని ఆదివాసీ విద్యార్థి అంటే అధికారులకు ఇంత చులకనా అని ఆయన అన్నారు వలస ఆదివాసి విద్యార్థి అని విద్యార్థిని మృతి మృతిని కూడా రెండు రోజుల దాకా సమాచారం బయటకి తెలియనీయకుండా ఉంచేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన ఆలోచనని అన్నారు. విద్యార్థిని మృతి పట్ల పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని ఏ స్థాయిలో ఎవరి నిర్లక్ష్యం లు ఉన్నాయో బయటకు తీసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదివాసి విద్యార్థిని మడకం ఇర్మమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థి నీ కుటుంబాన్ని సందర్శించిన వారిలో కొత్తపల్లి మాజీ సర్పంచ్ రేసు వీరస్వామి, వార్డు సభ్యులు మడకం నాగేశ్వరరావు, గ్రామ పెద్ద వెట్టి మాసయ్య, వెట్టి ఇర్మయ్య ,ముడివి కన్నయ్య, సోడి వీరయ్య, మడకం శేషయ్య, దులయ్య పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: