CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు...

Share it:

 మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామంలోని గోదావరి నదిలోకి ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.స్థానికుల సమాచారం మేరకు,గోదావరి నదికి మనోహర్,దుష్యంత్, గణేష్ అనే ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు.ఈ క్రమంలో మనోహర్,దుష్యంత్ లకు భయం వేయంతో అరుపులు,కేకలు పెట్టారు. దీనిని గమనించిన అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆ ఇద్దరు యువకులను కాపాడారు.కానీ గణేష్(17) అనే యువకుడు గల్లంతయ్యాడు.వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్ల సహాయం తో ఆ యువకుని ఆచూకీ కోసం గోదావరిలో గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: