మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సును కోరుకునే ప్రభుత్వం తెలంగాణ అని, ఇంతకు పూర్వం లాగానే రబీ పంటను కేంద్రం కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ,ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు విజ్ఞప్తి చేస్తూ, రైతుల తరపున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 2021 సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చుల గురించి వివరాలు, ఆడిటర్ రిపోర్టు, 2022- 23 సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమములో పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి , సంఘ డైరెక్టర్లు , గునిగంటి సమ్మయ్య ,
కొండేరు రాము, రావుల కనకయ్య, మర్ల భూషణం, పొనుగోటి కామేశ్వరరావు, సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: