ములకలపల్లి:మార్చి28:(మన్యం మనుగడ)ప్రతినిధి:
సార్వత్రిక సమ్మెలో భాగంగా ములకలపల్లి మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో లో సిఐటియు మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అధ్యక్షతన టెంట్ వేసి నిరసన దీక్ష నిర్వహించారు. ములకలపల్లి లో గల ఆశా వర్కర్ యూనియన్,మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్, గ్రామపంచాయతీ కార్మికులు యూనియన్,హెల్త్ వర్కర్స్ యూనియన్,పెట్రోల్ బంక్ యూనియన్,ఇతర రంగాల వారితో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ సులభ వ్యాపారం పేరుతో వ్యాపార వర్గానికి వ్యాపారం చేసుకునే విధంగా 44 లేబర్ 4 చట్టాలను మార్చి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాడని, కనీస వేతనం అమలు చేయక కార్మికులు ఆర్థికంగా బలహీనపడుతున్నా,ఒకపక్క ఎనిమిది గంటల పని దినములు 12 గంటలకు పెంచుతున్నాడు.కార్మిక యూనియన్ నిర్మాణం చేసుకుని హక్కును కాలరాస్తున్నారు కార్మికులకు ఈఎస్ఐ,పీఎఫ్,సౌకర్యం లేక ఉద్యోగ భద్రత లేక, ప్రమాద భీమా లేక రోడ్డున పడుతున్నారు.కావున కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పర్మనెంట్ చేయాలని అందరు ఐక్యంగా పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు నాగేశ్వరరావు రవికుమార్,మధు,నవీన్,ఆశ యూనియన్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి, నాగలక్ష్మి ,గ్రామపంచాయతీ కార్మికురాలు సాయి రత్న, రుక్మిణి,గంగాధర్ రావు,దానయ్య కుంచ శ్రీను, వెంకన్న,ఈ కార్యక్రమానికి సంఘీభావంగా మండలం లోని టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి శనగ పార్టీ అంజి,పువ్వల మంగపతి సీతారాములు,పువ్వల చందర్రావు మరియు తదితరులు సంఘీభావం తెలపారు. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: