CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉమా పార్వతీ జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో వేంచేసి ఉన్న ఉమా పార్వతీ అమ్మ వారి 56వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణకుంభంతో అభిషేకాలు చేశారు. ఐదురోజుల పాటు జరిగే ఈ జాతరలో అమ్మవారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కర్త కాసాని పుల్లారావు తెలిపారు. ఐదు రోజులపాటు సాయంత్ర సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పూజా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకునే అమ్మవారిని దర్శించుకుని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాసాని దుర్గ, మండల నాయకలు కాసాని వెంకటేశ్వరావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, కాసాని చంద్రశేఖర్, కాసాని మురళి, దమ్మపేట, అశ్వరావుపేట సబ్ ఇన్స్పెక్టర్స్ శ్రావణ్ కుమార్, చల్ల అరుణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: