మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ప్రభుత్వ ప్రాథమికస్థాయి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ అన్నారు.సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం నందు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రారంభించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సైతం దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలన్నారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ అన్నమణి, మెంటర్స్ గా భూక్య బాలు, కబీర్ దాస్,గిరీష్ కుమార్ లు వ్యవహరించారు.సిఆర్పి లు సేవ్య, ప్రవీణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: