CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను అడ్డుకున్న గిరిజన రైతులు.బీడు భూములుగా మారినా గిరిజన పంట పొలాలు....

Share it:  •  నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి....

చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి:మండలం పరిధిలోని బెండాలపాడు గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను గ్రామానికి చెందిన గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఈరోజు కెనాల్ వద్ద పనులు నిర్వహిస్తున్న జేసీబీ లను అడ్డుకోని పనులను నిలుపుదల చేసారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణం వల్ల ముత్యాలమ్మ చెరువు నుండి వ్యవసాయ భూములకు వెళ్ళాల్సిన పంట కాలువలు సీతారామ ప్రాజెక్ట్ కాలువ నిర్మాణం వల్ల పూర్తిగా తొలిగించడంతో సుమారు నాలుగు సంవత్సరాలుగా గిరిజనులకు చెందిన సుమారు 120 ఎకరాల పంట పొలాలు పూర్తిగా బీడు భూములుగా మారాయని. ఇదే విషయాన్ని అధికారులకు, కాంట్రాక్టర్ కు తెలిపిన్నప్పట్టికి మాయా మాటలు చెబుతూ పబ్బం గడుపుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. దీంతో గిరిజన రైతులు పంటపోలాలు ఉండి కూడా కూలి పనులకు వెళ్లి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.తక్షణమే అధికారులు స్పందించి కెనాల్ మీదుగా చఫ్టాలు నిర్మించాలని అప్పటి వరకు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. పనులను అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న డీఈ చంద్రశేఖర్, పనుల వద్దకు చేరుకొని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 20 రోజుల్లో మీ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అయినా రైతులు వినక పోవడంతో జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడా మోహన్ రావు, సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, సంఘటన స్థలానికి చేరుకుని అధికారులు రైతులను ఒప్పించి నిరసన విరమింపజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరవై రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ భానోత్ బాలు, బొర్రా సురేష్, గిరిజన రైతులు. ఈసం తిరుపతి, భూక్యా లాలు, కుంజా సావిత్రి, బేతి శ్రీను, వీరభద్రం, ఆంగోత్ లక్ష్మణ్, వర్ష బక్కులు, శ్రీను, వీరభద్రం, గోదా క్రిష్ణయ్య, తూము వెంకటేశ్వర్లు, ఏట్టి బుచ్చిరాములు, చీదర శ్రీను, తూము గోపాలరావు, గోదా వెంకటేశ్వర్లు, తూరుపాక పున్నం, కనితి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: