CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదింటి ఆడ బిడ్డకు మంత్రి పువ్వాడ పెళ్లి కానుక.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:పేద ప్రజలకు ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డలను అందించి వారికి అండగా నిలిచిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను వర్తింపజేస్తూ పువ్వాడ పెళ్లి కానుక పేరిట నూతన పెళ్లి దంపతులకు అండగా నిలుస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం, కొత్తమామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన వికలాంగుడు వెంకటయ్య కుమార్తె వివాహానికి బీరువాను కానుకగా పువ్వాడ యువజన సంఘం బాధ్యుడు మోటురి మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ యువజన సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: