CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వినూత్న ఆలోచనకు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక.ప్రతిభ కనబరిచిన ఎక్సలెంట్ భాష హై స్కూల్ విద్యార్థిని.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

49 వ రాష్ట్రస్థాయి పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏడు నమూనాలు ఎంపికయ్యాయి అని డి ఈ ఓ సోమశేఖర శర్మ ఒక ప్రకటన లో వెల్లడించారు . వీరిలో ఎక్స్లెంట్ భాషా హై స్కూల్ కు చెందిన విద్యార్థిని శ్రీవిద్య జ్యోతిర్మయి రాష్ట్ర స్థాయి లో జరిగే పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని అభినందన సభ లో యాజమాన్యం తెలిపారు . జ్యోతిర్మయి వినూత్న ఆలోచనతో కొండ ప్రాంతాల్లో గల మలుపుల దగ్గర జరిగే ప్రమాదాలను నివారించేందుకు సేఫ్ జర్నీ ఇన్ ఘాట్ రోడ్స్ పరికరాన్ని తయారు చేసింది . ఈ ప్రాజెక్టు పని చేసే విధానం కొండ ప్రాంతాల్లో గల ప్రమాదపు మలుపులో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు యొక్క స్థితిని రిఫరెన్స్ పాయింట్ ఏ మరియు బి గా అనుకున్నట్లయితే ఏ లో ఉన్న వ్యక్తి కి బి పాయింట్ లో ఉన్న వాహనం యొక్క వివరాలు బరువు ఆధారంగా కారు లారీ బైక్ మొదలైనవి మరియు ఏ పాయింట్ నుండి ఎంత దూరంలో ఉంది అనేది డిస్ప్లే బోర్డు ద్వారా ఏ మరియు బి పాయింట్ల లో గల డ్రైవర్స్ కు సమాచారం అందుతుంది .ఎవరు ముందు వస్తున్నారో తెలపడం ద్వారా ప్రయాణం క్షేమంగా సాగుతుంది . ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు .ఈ కార్యక్రమంలో ఎక్స్లెంట్ భాషా హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ, మా పాఠశాల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు. విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇంకా రాణించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ఖాదర్, యాకూబ్ షరీఫ్, ముక్కు వెంకట నర్సారెడ్డి, బండారు నరేంద్ర, పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్, ,ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: