CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతి, కుల, మతోన్మాదం,నిరుదోగ్యం పై భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుదాం.విప్లవవీరుల ను స్మరించుకుంటూ..పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 దేశంలో నెలకొన్న జాతి, విద్వేషం, కుల,మతోన్మాద, నిరుద్యోగo పరిస్థితులపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతున్నట్లు ఎస్.ఎఫ్.ఐ మంగపేట మండలం కమిటీ సభ్యుడు ఎం.డి. మేరాజ్ ఖాన్ పేర్కొన్నారు. మార్చి 23 న భారత స్వతంత్ర ఉద్యమ దివిటీలు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లను బ్రిటీష్ ముష్కర పాలకులు ఉరిశిక్ష అమలు చేసిన రోజు ను విప్లవవీరులను స్మరించుకుంటూ మంగపేట మండలంలోని రాజుపేట లో బుధవారం పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. దేశంలో ఒకే రోజు ఒకే సమయంలో ముగ్గురు విప్లవవీరుల అమరత్వానికి నేడు 91 ఏళ్ళు నిoడుతున్నాయని వెల్లడించారు. అతి చిన్న ప్రాయంలోనే ఈ దేశ సార్వభౌమత్వం కోసం, బ్రిటిష్,సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. రాజీలేని పోరాటం ద్వారా పరాయి పాలకుల నుండి ఈ దేశ భూస్వామ్య, పెట్టుబడ్డీదారి వర్గాల నుండి విముక్తి కావాలనీ, శ్రామిక వర్గరాజ్య స్థాపన ద్వారా సమసమాజాన్ని స్థాపించాలని వారు ఆకాంక్షించారన్నారు.విద్యను హక్కుగా చట్టం చేసి కూడా చేతులు దులుపుకుంటున్న నేటి దుస్సాహిక ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.అందరకీ ఉచిత ,న్యాణ్యమైన,సమానమైన,విద్య స్థానంలో కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగామారుస్తున్నారన్నారు. రాష్టంలో బంగారు సంగతేమోకానీ,నిరుద్యోగాలు ఉద్యోగాలు అడిగితే ఉక్కుపాదంమోపుతుందన్నారు. భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 91వ వర్దంతి సభల సంధర్బంగా ఈ శాస్త్రీయ విశ్లేషణతో ,కుల,మత, జాతీ విధ్వేషాలకు వ్యతిరేకంగానిలబడుదాం కలబడుదాం అని పిలుపునిచ్చారు.ఇప్పటికే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కార్పొరేటీకరణకూ, కషాయీకరణకు కేంద్ర ప్రభుత్వo మార్గం సుగమం చేసిందన్నారు.కనీస లౌకిక,పార్లమెంటరీ ప్రజాస్వామ్య హక్కులూ, రాజ్యంగం ద్వారా అందనున్న రిజర్వేషన్లు నూతన జాతీయ, విద్యా విధానం ద్వారా ఇక నుండి దూరం కానున్నాయన్నారు. మరోవైపు కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోడ్ లు ఉనికిలోకి వస్తే దానిపై ఆధారపడిన పేద రైతాంగం,కార్మికులు,వ్యవసాయ కూలీల పిల్లలు సైతం విద్యకు దూరoకానున్నారని పేర్కొన్నారు.కార్పొరేట్ విద్యా సలస్థల్లో చదివించే ఆర్ధికస్తోమత లేక ప్రభుత్వ విద్యా నాణ్యతలేమితో వ్యవసాయాధారిత కుటుంబాల పిల్లలు మధ్యలో చదువులు ఆపేసే దుస్థితి ఏర్పడుతున్నది అన్నారు.దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆకలి దారిద్య్రం నిరుద్యోగం విప్లవానికి పునాదులు అయ్యే అవకాశం ఉందన్నారు.

స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో ప్రయివేటీకరణకు వేసే సెటైర్ల వ్యతిరేకంగా పోరాడటమే భగత్సింగ్, రాజ్గురు,సుఖ్దేవ్ ల యాదిలో నిజమైన నివాళని తెలిపారు.భారత విప్లవ వీర కిశోరాలైన భగత్ సింగ్,రాజ్ గురూ, సుఖదేవ్ ల జీవితాలను ఆదర్శంగా తీసుకోని, ప్రతీ విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి అన్నారు.మన ఆలోచనలో మార్పుతో సమ సమాజ ఆవిష్కరణ కోసం పోరాడాలి అన్నారు. పాతికేళ్ల ప్రాయం లోనే బ్రిటిష్ వలస పాలకుల ను గడగడలాడించి,ఉరికంభాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల స్పూర్తి తో నేడు దేశంలో మతోన్మాద,యుద్దోన్మాద విద్వేషాలు రెచ్చగొడుతూ సామ్రాజ్య వాదులకు, స్వదేశీ బడా పెట్టుబడి దారులకు తాబేదారులు గా పని చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి యువకులు పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రఘు, వసంత, కేశవులు ,మురళి, గాంధీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: