CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీరామ నవమి మరియు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి తమవంతు సేవలు అందించటానికి ముందుకు వచ్చిన గ్రీన్ భద్రాద్రి టీం..

Share it:

 


భద్రాచలం మార్చి 27 శ్రీరామనవమి కోసం చేయబోయే అనేక రకముల సేవల లో భాగంగా మేము కూడా ముందుంటాం అని జిల్లా కలెక్టర్ శ్రీ దూరిశెట్టి అనుదీప్ IAS, ని కలవటం జరిగింది. శ్రీరామ నవమి కోసం తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం 

మంచి నీరు, మజ్జిగ, పానకం అందిస్తాం అని గ్రీన్ భద్రాద్రి అధ్యకులు శ్రీ బోగాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2012 లో ప్రారంభించిన గ్రీన్ భద్రాద్రి ద్వారా దాదాపు 20000 మొక్కల కు పైగా నాటడం జరిగింది. ఈ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలు గా మారి భద్రాచలం వచ్చే యాత్రికులలకు చల్లటి నీడని, గాలిని, ఆక్సిజన్ ని ఇస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తూ అందరిని ఆకర్షిస్తున్నాయి. భద్రాచలం లో గ్రీన్ భద్రాద్రి వారు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గ్రీన్ భద్రాద్రి సేవలను అభినందిస్తూ శ్రీరామనవమి ఏర్పాట్లలో భాగంగా గ్రీన్ భద్రాద్రి సేవలు అందించాలని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీ భోగాల శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 50 మంది వాలంటీర్లను గ్రీన్ భద్రాద్రి ద్వారా పంపుతామని చెప్పారు. ఈ యొక్క కలెక్టర్ సమీక్ష మీటింగ్ కి హాజరయిన గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి మరియు PRO కడాలి నాగరాజు జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ కి గ్రీన్ భద్రాద్రి ప్రతీక గా మొక్కని ఇవ్వటం జరిగింది.

Share it:

TS

Post A Comment: