CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన మసీదును ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణ పరిధిలోని, నందమూరి నగర్ లో నూతనంగా నిర్మించిన మసీదును స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం కమిటీ అధ్యక్షులు ఎండి ఆసిఫ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో ముస్లింలకు సమాన అవకాశాలు కల్పిస్తూ వారి అద్భుత అభివృద్ధికై తోడ్పడుతుందని, ముస్లిం కుటుంబాలలో అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ ద్వారా లక్షా పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మసీదు కమిటీవారు ఎమ్మెల్యేకు కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన మసీదుకు మజీదే ఉమ్రే సహది స్థలం, బిల్డింగ్ ఏర్పాటు చేసారని తెలిపారు. అదేవిదంగా మసీదు ప్రక్కన గల రోడ్డుకు సిమెంట్ రోడ్లు వేయించాలని, మసీదు అవసరాల కోసం 200 గజాల స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరగా అతి త్వరలోనే సిమెంట్ రోడ్డు వేయిస్తానని, మిగిలిన సమస్యలు కూడా పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీవారు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఆసిఫ్, పి జలాల్, కమిటీ సభ్యులు ఎస్.కె ఉస్మాన్, ఎండి రహీం,ఎండి ఆరిఫ్,ఎస్ కే వలీ పాషా, ఎస్ కే హలీం, ఎండి గాలిబ్ పాషా, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, అశ్వారావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, కలపాల శ్రీనివాసరావు, సోమని శ్రీను, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ,ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: