- గుంటూరు జిల్లా వాసి గుడిపూడి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వితరణ అందజేసిన కుటుంబ సభ్యులు
మన్యం మనుగడ, అశ్వాపురం:
గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామానికి చెందిన గుడిపూడి సూర్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమార్తె సింగరేణి ఏరియా హాస్పిటల్ సీనియర్ స్టాఫ్ నర్స్ ఝాన్సీ రాణి, కాంతారావు దంపతులు, కుమారుడు శేషు కోడలు పద్మ దంపతుల ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం అశ్వాపురం ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమంలో వృద్ధులకు 50 కేజీల బియ్యం బ్యాగులు,పండ్లు, బిస్కెట్స్ అందజేశారు.అలాగే సంతోష్ నగర్ బాల వెలుగు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సింగరేణి సేవాసమితి సభ్యులునాసర్ పాషా మాట్లాడుతూ అందరూ ఉండి అమ్మానాన్నలు అనాథలవుతున్న ఈ రోజుల్లో తమకు జన్మనిచ్చిన అమ్మానాన్నలను ఎన్నడు మర్చిపోకుండా వారి జ్ఞాపకార్థం వృద్ధులకు అనాథలకు అన్నం పెట్టాలనే ఝాన్సీ రాణి , శేషు (సోదర సోదరీమణులు)ఆలోచన అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ రాణి, కాంతారావు, శేషు, పద్మారావు, భూషణం, మున్ని డేగల వంశి, సర్వేష్, వృద్ధాశ్రమం నిర్వాహకులు ఎస్ కే షహనాజ్, మేహరజ్ బాల వెలుగు నిర్వాహకులు బి. జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది రామకృష్ణ, దేవి , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: