మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామంలో లో చర్ల,దుమ్ముగూడెం మండలాల స్థాయి వాలీబాల్ టోర్నీ ని భద్రాచలం టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల యువత మానసికంగా శారీరకంగా దృఢంగా వుంటారు అని అలాగే ఎల్లవేళలా యాక్టివ్గా వుంటారు అని తెలిపారు. అదేవిధంగా యువత అందరూ కూడా అతిత్వరలో విడుదల కాబోతున్న జాబ్ నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకొని ముందుకు వెల్లవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చర్ల సీఐ అశోక్ కుమార్ , ఎస్సై రాజు వర్మ, పిఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, సత్యనారాయణపురం పిఏసిఎస్ చైర్మెన్ శ్రీనివాసరాజు, చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ ఆర్ కొత్తగూడెం సర్పంచ్ ముప్పిడి లక్ష్మి, ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, సీనియర్ నాయకులు దొడ్డి సూరిబాబు, దొడ్డి తాతారావు, ముప్పిడి సోమరాజు, నాగరాజు, సర్పంచులు కోరం నాగేంద్ర, పొడియం మురళి,ముమ్మినేని సత్య సంపన్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్, పంజా రాజు, పాల్గొనడం జరిగింది.
Post A Comment: