CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

Share it:


మన్యం మనుగడ ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ ఎస్సీ కాంప్లెక్స్ ఆవరణలో మహాజన సోషలిస్టు పార్టీ ఎం ఎస్ పి ములుగు జిల్లా కో ఆర్డి నేటర్ జన్ను రవి అధ్యక్షతన నిర్వహించగా సావిత్రిబాయి పూలే వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా ములుగు జిల్లాసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.అనంతరం ముంజల బిక్షపతి మాట్లాడుతూ..

సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని భారతీయ సంఘ సంస్కర్త అని బహుజన ఆశ జ్యోతి భారతీయ మొదటి మహిళ ఉపాధ్యాయురాలు అని బిక్షపతి అన్నారు.సావిత్రి బాయి పూలే రచయిత కూడా అని ఆయన అన్నారు.బహు జనుల ఆశ జ్యోతి సావిత్రి బాయి పూలే మహిళాలోకానికి ఆదర్శ జ్యోతి జ్యోతిరావు పూలే సరస్వతి దేవి నీ చదువుల తల్లిగా మార్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే అగ్రకుల కుట్రలు అణచివేతకు గురైన సావిత్రిబాయి పూలే ఎన్నో కష్టాలు అవమానాలు అధిగ మించి ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే పాఠశాలకు వెళ్తుండగా అల్లుకు చల్లిన నీళ్లు మీద చల్లిన తర్వాత నే పాఠశాల లోకి అనుమతించే వారని అన్నారు.అటువంటి అవమానాలు భరించిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఆమె అని బిక్షపతి అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య మాదిగ మాట్లాడుతూ.చదువు కు ఆమడ దూరంలో ఉన్న భారత మహిళా లోకానికి అక్షరాలు నేర్పి అక్షరజ్ఞానం పంచి వారి జీవితాల్లో అక్షర జ్యోతి నీ వెలిగించి నా మహోన్నతమైన మహిళా శక్తి జ్యోతిరావు పూలే అనే నెమలి నర్సయ్య మాదిగ అన్నారు.మాదిగ హక్కుల పరిరక్షణ సమితి యమ్ యస్ పి ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ బొమ్మ కంటి రమేష్ వర్మ మాట్లాడుతూ.సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర శాత రాజు జిల్లాలో జన్మించిన మహా మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే ఈ రోజు లలో మహిళలు ఆకాశంలో సగభాగం ఉండడానికి కారణం సావిత్రిబాయి పూలే ఆదర్శం ఇవ్వాళ భారతదేశంలో మహి ళలు అన్ని రంగాల్లో ముందున్న కారణం సావిత్రిబాయి పూలే మహిళలు దేశాన్ని ప్రధాని కావడం కారణం సావిత్రిబాయి పూలే అని రమేష్ వర్మ అన్నారు.ఈ వర్ధంతి సభలో ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు గట్టు మమత, జెర్రిపోతుల పైడి బాబు ఎమ్మార్పీఎస్ మండల అధ్య క్షులు కనకం దేవదాసు,ఓరు గంటి రఘు,రేలా విజయ్, మాజీ ఎంపిటిసి బిట్ల కొముర య్య,గుండాల నరసయ్య, భద్రయ్య,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: