CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిలకలగండి ముత్యాలమ్మ జాతర మహోత్సవంను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


 

 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానం 47 వ వార్షికోత్సవ మరియు జాతర మహోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, దేవస్థానం ఈవో నల్లమోతుల శేషయ్య, తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ, చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానంకు అనాది నుండి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అమ్మవారి దర్శనార్థం జాతర మహోత్సవంకు వస్తుంటారని, ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ద్వారా ఇటువంటి దేవాలయాలను అభివృద్ధి చేస్తుందని, వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానం అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినాయకపురం సర్పంచ్ పొడియం సత్యవతి, ఉప సర్పంచ్ నల్లపు లక్ష్మీపతి, ఎంపీటీసీ మారుతి లలిత, జెడ్పిటిసి వరలక్ష్మి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, కలపాల శ్రీను, ఉప్పల మురళి, తమ్మిశెట్టి శ్రీను, దేవస్థానం అర్చకులు మేడూరి సాంబ శివ ప్రసాద్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: