![]() |
మన్యం మనుగడ ,మణుగూరు: ఓ భూమి సెటిల్మెంట్ చేస్తా అని తన దగ్గర పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు అని మణుగూరు చెందిన కోనే విజేందర్ కుమార్ ఆరోపించారు. దీనిలో భాగంగా ఇప్పటికే అప్పు చేసి చంద్ర సంతోష్ కుమార్ కిరూ. 50 వేలు ఇవ్వడం జరిగిందని పని పూర్తి చేయకపోగా మరల రూ.50వేలు కావాలని డిమాండ్ చేయడంతో తన మొబైల్ ఫోన్లు తాకట్టుపెట్టి మరో ఇరవై వేలు చందా కు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. తన పని చేసి పెట్టకుండానే సంతోష్,సంతోష్ వర్గీయులు తన మీద కేసు పెట్టడం జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు.ఇదెక్కడి న్యాయం? నేను ఎవరిని కొట్టాను? ఎవరిని తిట్టాను?
అంటే సామాన్యుడికి ఎక్కడా న్యాయం దొరకదా అని ఆవేదన వెలిబుచ్చారు.
నాకు డబ్బులు ఇవ్వాల్సిన ఇవ్వకపోగా రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పేసి మీ రాజకీయాలకు ఒక సామాన్యుడిని బలి చేస్తారా
నా మరణానికి కారకులు చందా సంతోష్ కుమార్, కొమ్ము నాగేంద్ర, పిరినాకి నవీన్, బీరం సుధాకర్ రెడ్డి, కాట బోయిన నాగేశ్వరరావు, ఎండి షబానా, కూరపాటి సౌజన్యలు అంటూ తీవ్ర మానసిక వేదనతో కోనే విజేందర్ ఓ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు . ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి మణుగూరు లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. *కోనే విజేందర్ ఓ లేఖ* ✍️నేను అనగా కోనే విజేందర్ కుమార్
✍️గతంలో నాకు ఉన్నటువంటి భూ సమస్యపై కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించగా
✍️ మణుగూరు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అయిన డాక్టర్ చంద్ర సంతోష్ కుమార్,
✍️ నీ సమస్యను నేను పరిష్కరిస్తానని కానీ ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు పంపించు అన్నాడు
నాకు ఉన్నటువంటి ఇ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను లక్ష రూపాయలు ఇవ్వలేను కానీ 50,000 రూపాయలు మాత్రం పంపిస్తానని చెప్పగా దానికి డాక్టర్ చందా సంతోష్ కుమార్ అంగీకరించి 50వేల రూపాయలు పంపించామన్నారు
దీనికి నేను అంగీకరించి ఫోన్ పే ద్వారా 30 వేల రూపాయలు మధ్యవర్తి ద్వారా మిగిలిన 20 వేల రూపాయలు ఇచ్చినాను
✍️ మరల పార్టీ నీ పని మీద హైదరాబాద్ వెళుతున్నాను నాకు పదివేల రూపాయలు కావాలని చెప్పగా నా యొక్క రెండు ఫోన్లు తాకట్టు పెట్టి కొమ్ము నాగేంద్ర కు మరియు చందా సంతోష్ కుమార్ గార్లకు పంపించినాను. విజయేందర్
✍️ డబ్బులు తీసుకొని నాయొక్క సమస్యను పరిష్కరించలేదు
ఇది జరిగి ఏడు నెలలు కావస్తున్నా , ఫోన్ లు ఎత్తకపోవడం పార్టీ ఆఫీసుకు వస్తే రేపు రా మా పుర అంటూ కాలయాపన చేస్తూ 7 నెలలు గడిపారు
✍️ నా యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈనెల 26 తారీఖున నా యొక్క మొత్తం డబ్బులు 60 వేల రూపాయలు అడగగా
నన్ను రోడ్డు మీద అడిగి స్థాయి మీద అ నేను ఒక కన్వీనర్ స్థానంలో ఉన్న నువ్వు నన్ను ఏం చేయగలవు తనకు ఇష్టమొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ నీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తూ నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు
✍️ చంద సంతోష్ కుమార్ అనుచరులైన కొమ్ము నాగేంద్ర నా మిత్రులకు ఫోను చేసి నా పైన దుర్భాషలాడుతూ వాడు ఎక్కడ కనిపించిన చంపేస్తానని బెదిరిస్తున్నారు నాకు నా కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని ఉంది.
Post A Comment: