CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రూపు రాజకీయలకు ఆజ్యం పోస్తున్న మాజీ ఎంపీ పోగులేటి, మాజీ ఎమ్మెల్యే పాయం.మాజీ ఎమ్మెల్యే పాయం,ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ మీ పద్దతి మార్చుకొండి సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాయం నరసింహరావు.

Share it:

 



  • ఒక్క సారిగా మండలంలో అక్కడ అక్కడ ప్లెక్సి లు గెలవడంతో అయోమయంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు

మన్యం మనుగడ కరకగూడెం:మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు అత్యవసర సమావేశం ఎర్పాటు చేశారు.ఈ సమావేశంలో మండల సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహారావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర్లు మండలంలో పరామర్శలా పేరుతో పర్యటించడాని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . ప్రియతమ నాయకులు రేగా కాంతారావు కి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందున విద్య నేర్చుకోలేక కుయుక్తులు పన్నినా ప్రజలు మిమ్మలను నమ్మరాని అన్నారు. ఒకే పార్టీలో ఉంటూ కనీసం పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకుండా గ్రూపు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుని టిఆర్ఎస్ పార్టీలో కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇర్ప.విజయ్ కుమార్, బత్తిని నరసింహరావు, పోలెబోయిన నరసింహరావు, కొమరం. విశ్వనాధం, కుంజా వసంతరావు,భూక్యా.భాగ్య లక్ష్మి, తాటి సరోజిని,పోలెబోయిన. పాపమ్మ,జవ్వాజీ రాధ, అరెం సాంబ,తోలెం.సావిత్రి, గొగ్గలి నాగమణి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: