CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు సుడిగాలి పర్యటన.అధైర్యపడొద్దు మీ వెంట నేనుంటా-ప్రభుత్వ విప్.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా వారు మాట్లాడుతూ అధైర్యపడొద్దు మీ వెంట నేనుంటా అని తెలియజేశారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలియజేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో అనారోగ్యంతో చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, కార్యకర్తలలో కొండంత ధైర్యాన్ని నింపారు. నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను పరిశీలించారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచు కట్ల వీరభద్రం, గ్రామ సర్పంచ్ కాక అశోక్, ఉపసర్పంచ్ టేకుల సురేష్, ఎంపీటీసీ గాదె జయ, టిఆర్ఎస్ నాయకులు గజ్జల లక్ష్మారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, మొగిళ్ల పెద్ద వీరారెడ్డి, మొగిళ్ళ వీరారెడ్డి, పగడాల రామి రెడ్డి, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, కందుల కృష్ణార్జున రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, చిలక వెంకట్రామయ్య, మండలఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటరమణ, మంగళగిరి రామకృష్ణ, వల్లపు కృష్ణ, కృష్ణరాజు, మల్లయ్య, వెంకన్న, సూర్య, నారాయణ, రవి,మండల నాయకులు, యువజన నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: