CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కన్నాయిగూడెం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్నటువంటి గిరిజన పోడు రైతు సుతారి శ్రావణ్ కుమార్, తండ్రి, సుతారి నరసింహారావు అనే వ్యక్తి కి తాము సాగుచేసుకుంటున్న టువంటి భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతామని నోటీసులు చూపించడంతో తాము సాగు చేసుకున్నటువంటి భూమి నీ ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనపరచుకుంటే తమ జీవనాధారమైన భూమిని కోల్పోతానని తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే అతన్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు తరలించారు.అక్కడి వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తేల్చి చెప్పి వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.తన ప్రాణానికి ఏమైనా హాని జరిగితే దీనికి కారకులైన ఫారెస్ట్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక పక్క ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి పోడు భూమి దరఖాస్తులు స్వీకరించి మరోవైపు అదే ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతో పోడు సాగుచేసుకుంటున్న అటువంటి భూములలో మొక్కలు నాటే ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆవేదనను వ్యక్తం చేశారు.గత రెండు రోజుల క్రితం కన్నాయిగూడెం గ్రామంలో వీరాపురం బీట్ అధికారి అయిన విజయ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని ఆధ్వర్యంలో వారి సిబ్బందితో వచ్చి కన్నాయిగూడెం గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న రైతుల భూములలో యంత్రాలతో ట్రెంచ్ లను తీసి మొక్కలు నాటుతామని గ్రామస్తులను హెచ్చరించి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పోడు భూములను వదులుకోమని,ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యం పై గిరిజనులు అందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం అయినటువంటి బీట్ అధికారి విజయ్ పై కేసు నమోదు చేసి , అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కల్తి రత్తయ్య, సుతారి నరసింహారావు, ఉకే కేశవరావు , కలం లక్ష్మయ్య, వార్డు మెంబర్ పోలెబోయిన రామయ్య,పోలెబోయిన పుల్లయ్య,పీసా కమిటీ ఉపాధ్యక్షులు పోలెబోయిన శేఖర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి ఊకె నరేష్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఊకే గణేష్, ఊకే వెంకటేశ్వర్లు, ఊకే నరసింహారావు, పోలెబోయిన అశోక్ , గొప్ప సతీష్ డిమాండ్ చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: