CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మైనారిటీ గురుకులాలను సద్వినియోగం చేసుకోండి.ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ--:ప్రిన్సిపాల్ అరుణ కుమారి.

Share it:


ములకలపల్లి:మార్చి12:(మన్యం. మనుగడ)న్యూస్:

తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించి వారి విద్యాభివృధ్ధికి, వారి బంగరు భవిష్యత్తుకు బాటలు వేయాలని కొత్తగూడెం తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఎమ్ . జె. అరుణ కుమారి కోరారు. కళాశాల అడ్మిషన్లకోసం జగన్నాథపురం వచ్చారు.మైనారిటీ పాఠశాల, కళాశాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, 6, 7, 8 తరగతులలో కూడా సీట్లభర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 5 మరియు, ఇంటర్ ప్రధమ సంవత్సరానికి ముస్లిం మైనారిటీలు 55, క్రిస్టియన్ 5, బీసీ 10, ఎస్సీ5, ఎస్టీ 3 ,ఓసీలకు 2 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపాల్ అరుణకుమారి వివరించారు. విద్యార్ధులకు నీట్ , ఐఐటీ, ఎంసెట్ లలో కళాశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మైనారిటీ వర్గాలు గురుకులాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్బంగా తెలియజేసారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చని తెలియజేసారు.

Share it:

TS

Post A Comment: