CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ పిలుపుమేరకు ఏటూరు నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని బూటారం గ్రామంలో గిరిజన మహిళా నాయకురాలు మండల తెరాస పార్టీ మహిళా అధ్యక్షురాలు ఈసం స్వరూప, ఏటూరు నాగారం మండల మాజీ ఎంపీపీ తూరం పద్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం గిరిజన మహిళ నాయకురాలు మాట్లాడుతూ.గిరిజన రిజర్వేషన్ బిల్లు పై కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయ మంత్రి,ప్రజలను తప్పుదోవ పట్టించి గిరిజనులపై అసత్య ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 10 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయమంత్రి తమకు పంపించా లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి ఆధారాలు ఉండగా తెలంగాణ రాష్ట్ర గిరిజనులను అవమాన పరిచే విధంగా లోక్ సభలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని అన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సో లం కమల,సోయం సత్యమ్మ, సుమలత,సమ్మక్క,చంద రమణ,సోయం కన్నయ్య, తొలెం సమ్మయ్య,పంజాల ధనలక్ష్మి,నాగలక్ష్మి,రేగ లక్ష్మి, సరుకుల నాగేశ్వరరావు,లక్ష్మి, ఏట్టి సంతోష్,రామయ్య,తాటి రాములు,కుడుముల శివయ్య, ఏటూరు నాగారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ధనపునేని కిరణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చందా లక్ష్మీనారాయణ, గండేపల్లి నరసయ్య,కాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: