CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చినజీయర్ స్వామి పై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి.వాజేడు మండలం పెద్ద గొల్లగుడెం స్కూల్ టీచర్స్ డిమాండ్.

Share it:


మన్యం మనుగడ వాజేడు మార్చి 21

ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదివాసీల ఇలవేల్పు , ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా జాతర ప్రసిద్ధి గాంచిన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, కొన్ని కోట్ల మంది భక్తులు,అధిక సంఖ్యలో కుంభమేళా జాతర లో పాల్గొని మొక్కులు చెల్లించి పవిత్రంగా ఆరాధించే, పూజించే, దేవతలను, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని,ములుగు జిల్లా వాజేడు మండలం పెద్ద గొల్లగూడెం స్కూల్ టీచర్స్, స్కూల్ ఆవరణలో నిరసన తెలిపారు, హిందుత్వ ఔన్నత్యాన్ని చాటుతూ, ఆదివాసీలను, ఆదివాసీల దేవతలను, కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, వ్యాఖ్యానాలు చేసిన అగ్ర కులస్తుల పీఠాధిపతి చిన్న జీయర్ స్వామి ని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ వేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం గొంది విగ్నేశ్వర రావు, ఇర్ప. కేశవరావు. ఎట్టి బాబురావు. పాయం నాగేశ్వరరావు. మడివి నాగేందర్. కడియం కృష్ణ , పూసం స్వప్న . అట్టo రమాదేవి చెలే ప్రసాద్.యానక కవిత .మడప యశోద. బుక్య చిన్ని.తేజవత్ బులి. ద్రౌపది. ఇతరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: