మన్యం మనుగడ ఏటూరు నాగారం
గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఐ టి డి ఎ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో మార్చి 15 తారీకు నాడు మంగపేట మండలం రైతు వేదిక భవనం లో నిర్వహించే జాబ్ మేళ ను గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ ఉద్యోగం మేళ లో అపోలో ఫార్మసీ,మైల్ స్టోన్,రియల్ ఎస్టేట్,ఎస్ఎస్ బయో ప్లాంటేషన్,జి ఫోర్ సెక్యూరిటీ సర్వీసెస్,నవత ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.*విద్యా అర్హతలు*
పదవ తరగతి, ఇంటర్,డిగ్రీ, ఐటిఐ,డిప్లమా,బి ఫార్మసీ, ఎంఫార్మసీ,డి ఫార్మసీ,చదివి ఉండాలని అన్నారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులు అని అన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 15వ తారీకు మంగపేట మండలం రైతు వేదిక భవనం లో జరిగే సెలక్షన్లు లో పాల్గొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాల కొరకు 8008932159,9490341911,7981633716 నెంబర్లను సంప్రదించగలరు అని తెలిపారు.
Post A Comment: