CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఆటో యూనియన్ జేఏసి ఆధ్వర్యంలో ఆర్టీవో తోట కిషన్ కు వినతిపత్రం.

Share it:

 



ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా 28 , 29 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 29వ తేదీన ఆర్టీవో తోట కిషన్ రావు కు ఆటో వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు . తదనంతరం వారు 2019 రవాణా చట్టాన్ని రద్దు చేయాలని , ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని , ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు అరికట్టాలని . పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ రేట్లను తగ్గించాలని , రాష్ట్ర ప్రభుత్వం ఈ చలానాలపై ఇచ్చిన తగ్గింపు గడువును నెల రోజులు పెంచాలని , ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఆటో కార్మికులకు పదివేల రూపాయలు ఇవ్వాలని , అర్హులైన ఆటో కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో యం.వి.ఐ వరప్రసాద్ , టీ.ఆర్.ఎస్. కెవి - టీఏ.టీయూ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ , సీఐటీయూ నాయకులు జిల్లా ఉపేందర్ , ఏ.ఐ.టీ.యు.సి నాయకులు మోహనరావు , ఐ.యాప్.టీ.యూ నాయకులు శ్రీను , ఎండీ పాషా , టీఏ.టీయూ నగర అధ్యక్ష కార్యదర్శులు SK సత్తార్, వేమ సెల్వరాజ్ , అడ్డా ప్రెసిడెంట్స్ , కమిటీ సభ్యులు మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: