CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి,

Share it:

 



 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్లు, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఆసరా పెన్షన్ లను 5 వేలకు పెంచాలని, సొంత ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పందా మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం తో పాటు వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ లు, రేషన్ కార్డులు, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని, ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

         ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

        ఈ కార్యక్రమంలో మణుగూరు సబ్ డివిజన్ నాయకులు ఎండీ. గౌస్, కురసం.రామకృష్ణ, తిరుపతి, వెంకటేశ్వర్లు, వెంకటేష్, ప్రభాకర్, రాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: