CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిన్న జీయర్ స్వామి పై చర్యలు తీసుకోవాలని దమ్మపేట పోలీస్ స్టేషన్ లో మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఫిర్యాదు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి (18 ) శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దమ్మపేట మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం చిన్న జీయర్ స్వామిజీ పై దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాద్ అందజేశారు. అనంతరం నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులు రావుల రామకృష్ణ మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి ఆదివాసి వనదేవతలను కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి ఇలవేల్పులయిన, ఆసియా ఖండంలోనే కుంభమేళా లాంటి ఆదివాసీ గిరిజన జాతర అయిన సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దేవతలు కాదని అవమానించడం సరికాదని, ఆదివాసిల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని, చినజీయర్ స్వామి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారిపై తగు చర్యలను తీసుకోవాలని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల సాయి, ఉపాధ్యక్షులు సిద్దిన చలపతిరావు, కోశాధికారి పాశం ప్రసాద్, మండల గౌరవాధ్యక్షుడు వాసం పోలయ్య, జిల్లా కోశాధికారి పాశం వెంకటేశ్వరరావు, గొల్లమందల రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: