CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాజేడు మండలం లో ట్రైకార్ రుణాల గ్రామ సభలు..

Share it:


మన్యం మనుగడ వాజేడు/

వాజేడు: గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా రూ.తో 2020-2021_2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రైకార్‌ రుణాలను గిరిజన యువతి యువకులకు అందించేందుకు అధికారులు గ్రామాలలో గ్రామ సభలు సోమవారం నిర్వహించారు. రూ. కోటి 15 లక్షలతో సబ్సిడీగా అందించి రుణాలు మంజూరు చేసేందుకు ఒక్క రోజే ఆరు గ్రామాలలో గ్రామసభ నిర్వహించారు. మినీ ట్రాక్టర్లు, టెంట్‌హౌస్‌లు, మినీ రైస్‌ మిల్లులు, ఫొటో స్టూడియోలు, ఆటోలు, ఫ్లోర్‌మిల్స్‌, సౌండ్‌ సిస్టమ్స్‌, కిరాణా, సెల్‌ పాయింట్‌ రిపేరింగ్‌, బ్యూటీ పార్లర్స్‌, టైలరింగ్‌, ఫ్యాన్సీ దుకాణాలు, ఆయిల్‌ ఇంజన్లు తదితర విభాగాల ఏర్పాటుకు రుణాలు అందజేయనున్నారు.

ఉపాధి యూనిట్ల కోసం రూ. కోటి కోటి15 లక్షలతో రుణాలుగా మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులకు సబ్సిడీ ప్రభుత్వం భరించనుంది. మొత్తం 125 యూనిట్లను గిరిజనులకు ట్రైకార్‌ రుణాల ద్వారా పంపిణీ చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి పలు గ్రామాలలో మండల పరిషత్ అధికారులు గ్రామపంచాయతీ సర్పంచులు అధ్వర్యంలో లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

మండల కేంద్రంలోని అయ్యవారిపేట, చండ్రుపట్ల, టేకులగూడెం, కృష్ణాపురం, పేరూరు, ధర్మవరం, చెరుకూరు పలు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. పలు గ్రామాలలో 15 నుండి 16 తారీకు వరకు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. సంబంధించిన లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయను న్నారు.రుణాల మంజూరుకు ఎంపీడీవో కార్యాలయాలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా గిరిజనుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి అవకతవకలు జరగకుండా గ్రామసభల ద్వారా ఎంపిక విధానాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, మండల అభివృద్ధి అధికారి విజయ, ఎం పీ ఓ లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శి రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాలలో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రైకార్‌ రుణాలు మంజూరు చేసి గిరిజనులకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పేద గిరిజనుల అభివృద్ధికి ట్రైకార్‌ రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు సహకరించాలని స్పెషల్ ఆఫీసర్ సమావేశాల్లో కోరారు.

Share it:

TS

Post A Comment: