CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన ప్రాంత యువతకు ఐటిడిఎ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుంది

Share it:

 


  • దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐటీడీఏ పీవో గౌతమ్, ఏఎస్పి రోహిత్ రాజు


మన్యం టివి, దుమ్ముగూడెం::

స్థానిక ములకపాడు మైదానంలో దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఆదివాసి యువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి 45 గ్రామాల క్రీడాకారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఐటిడిఎ పిఓ గౌతమ్ భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. దుమ్ముగూడెం సీఐ దోమలు రమేష్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అలానే రాబోయే రిక్రూట్మెంట్లో పోలీస్ జాబ్స్ కోసం సిద్ధంగా ఉండాలని ఎవరైనా కోచింగ్ కావాలనుకుంటే దుమ్ముగూడెం పోలీస్ వారికి పేర్లు నమోదు చేసి సహకారం తీసుకోవాలని తెలియచేసారు. ఐ టి డి ఎ పిఓ మాట్లాడుతూ గిరిజన ప్రాంత యువతకు ఐటిడిఎ ఎప్పుడు సహకారం అందిస్తుందని రాబోయే ఉద్యోగ నియామకాల్లో పోలీస్ శాఖ, మేము సహకారం అందిస్తామని ఏప్రిల్ 15 తారీకు నుంచి 400 మంది పిల్లలతో రేసిడెన్షియల్ ట్రైనింగ్ 3 నెలలు ఏర్పాటు చేస్తామని దాన్ని ఏజెన్సీలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్పోర్ట్స్ స్కూల్స్ లో జాయిన్ అయ్యే పిల్లలు కిన్నెరసాని బాయ్స్ స్కూల్, కాచన పల్లి గర్ల్స్ స్కూల్ ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు త్వరలో ఐ టి డి ఎ తరుపున దుమ్ముగూడెం క్రీడామైదానంలో వాలీబాల్ లీగ్ ఏర్పాటు చేస్తామని దానికి క్రీడాకారులు సిద్ధముగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ట్రైనీ ఐఏఎస్ అభిషేక్ ,దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ , సిఆర్పిఎఫ్ డి.ఎస్.పి రేవతి ,డిడి రమాదేవి ,స్పోర్ట్స్ ఆఫీసర్ విరునాయక్, జడ్పిటిసి సీతమ్మ, ఎంపీపీ రేస్ లక్ష్మి ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: