CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా తిప్పనపల్లి పెద్దమ్మ తల్లి జాతర...

Share it:

 



 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండలంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా తిప్పనపల్లి పెద్దమ్మతల్లి జాతర అత్యంతం వైభవంగా జరిగింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ జాతరకు చుట్టుప్రక్కల మండలాల నుండి ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, పెనుబల్లి, జూలూరుపాడు మండలాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరైనారు. ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ప్రధానంగా యువకులు అగ్నిగుండంలో నిప్పులను తొక్కే కార్యక్రమంలో పోటీపడి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తులందరికీ మంచి నీటిని సంస్థ అధ్యక్షులు గొళ్ల రమేష్ ఆధ్వర్యంలో అందజేశారు.ఉత్సవ,నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

Share it:

TS

Post A Comment: